చినజీయర్ స్వామిని కలిసిన సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ సోమవారం సతీసమేతంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ వద్ద గల త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్ళారు. కేసీఆర్‌ దంపతులకు ఆశ్రమంలో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చినజీయర్ స్వామి వారిని సత్కరించి ఆశీర్వదించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆశ్రమ ఆవరణలో సిఎం కేసీఆర్‌ జమ్మి మొక్కలను నాటారు. తరువాత ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సిఎం కేసీఆర్‌ అతిధులతో కలిసి భోజనం చేశారు. 

సిఎం కేసీఆర్‌, చినజీయర్ స్వామితో కలిసి యాదాద్రి పర్యటనకు వెళ్లాలనుకొన్నారు కానీ ప్రస్తుతం స్వామీజీ చతుర్మాస దీక్షలో ఉన్నందున యాదాద్రి పర్యటన వాయిదా వేసుకొన్నారు. త్వరలో యాదాద్రిపై సుదర్శనయాగం నిర్వహించి ఆలయాన్ని పునః ప్రారంభించే అంశంపై సిఎం కేసీఆర్‌ స్వామీజీతో చర్చించారు. అనంతరం సిఎం కేసీఆర్‌ దంపతులు  గజ్వేల్‌లోని తమ ఫాంహౌసుకి వెళ్ళిపోయారు.