సంబంధిత వార్తలు

హుజూరాబాద్ ఉపఎన్నికకు మొత్తం 56 మంది అభ్యర్ధులు బరిలో దిగారు. వారిలో బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్‌తో సహా అదే పేరుగల మరో ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. వారిలో ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ తరపున ఇప్పలపల్లి రాజేందర్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్ధిగా ఇమ్మడి రాజేందర్, న్యూ ఇండియా పార్టీ అభ్యర్ధిగా ఈసంపల్లి రాజేందర్ నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈటల రాజేందర్‌కు బదులు వారిలో ఎవరో ఒకరికి ఓటు పడే అవకాశం ఉంది. కనుక దీంతో ఈటల రాజేందర్‌కు ఎంతో కొంత నష్టం తప్పదు.