హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బల్మూరి ఖరారు

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా బల్మూరు వెంకట్ నర్సింగ్ రావు పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది. వెంకట్‌ భారత జాతీయ విద్యార్ధి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. పార్టీ తరపున చురుకుగా రాజకీయాలలో పాల్గొంటున్నారు. 

టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌, బిజెపి అభ్యర్ధిగా ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. కనుక ఇప్పటివరకు టిఆర్ఎస్‌ నేతలకు ఈటల రాజేందర్‌కు మద్యనే యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి కూడా బరిలో దిగుతున్నారు కనుక ఇక నుంచి మూడు పార్టీల మద్య యుద్ధం మరింత రసవత్తరంగా మారుతుంది.