పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హౌస్ అరెస్ట్

ఈరోజు కాంగ్రెస్‌ అధ్వర్యంలో దిల్‌సుక్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్ వరకు విద్యార్ధి, నిరుద్యోగ ర్యాలీ జంగ్ సైరన్’ పెరియా భారీ ర్యాలీ నిర్వహిస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కానీ పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. అయినా ర్యాలీలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి ప్రకటించడంతో, ఈరోజు ఉదయం నుంచే జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి, ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్బందించారు. దిల్‌సుక్‌నగర్‌ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. నగరంలో ఇతర ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు మెట్రో ద్వారా అక్కడికి చేరుకొనే అవకాశం ఉన్నందున మెట్రో స్టేషన్‌ను కూడా కొన్ని గంటల సేపు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. తమ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.