నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యి ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలిపిన తరువాత రేపటికి వాయిదా పడతాయి. తరువాత శాసనసభ స్పీకర్, మండలి ప్రోటెం ఛైర్మన్, ప్రధానప్రతిపక్ష సభ్యులు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమయ్యి ఉభయసభల షెడ్యూల్, సమావేశాలలో చర్చించాల్సిన ఎజెండాను ఖరారు చేస్తారు.