ఎయిర్ చీఫ్ స్టాఫ్‌గా వివేక్‌ రామ్ చౌదరి

భారత్‌ వాయుసేనకు కొత్త అధిపతి రాబోతున్నారు. ప్రస్తుతం వాయుసేనకు ఛీఫ్‌గా వ్యవహరిస్తున్న రాకేశ్ కుమార్‌ సింగ్‌ను భదౌరియా సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయబోతున్నారు. కనుక ప్రస్తుతం డెప్యూటీ ఎయిర్‌ చీఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎయిర్ మార్షల్ వివేక్‌ రామ్ చౌదరిని ఛీఫ్‌గా నియమించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.      

 వివేక్‌ రామ్ చౌదరి 1982లో భారత్‌ వాయుసేనలో పైలట్‌గా చేరారు. ఈ 38 సం.లలో వాయుసేనకు చెందిన అన్ని రకాల యుద్ధవిమానాలు నడిపారు. ఇంతకు ముందు వెస్ట్ ఎయిర్ కమాండ్‌కు కమాండింగ్ ఇన్‌ ఛీఫ్‌గా పనిచేశారు. రెండు నెలల క్రితమే వివేక్‌ రామ్ చౌదరి డెప్యూటీ ఎయిర్‌ చీఫ్‌ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు వాయుసేనలో ఈ అత్యున్నత పదవిని చేపట్టబోతున్నారు.