పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతివ్వండి: జీహెచ్‌ఎంసీ

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలులెందంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునః పరిశీలించాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ నేడు హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసింది. హైకోర్టు ఆదేశం వలన గణేశ్ నిమజ్జనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక హైకోర్టు ఆదేశాలను పునః పరిశీలించవలసిందిగా కోరింది. హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతిస్తే నిమజ్జనం చేసిన 24 గంటలలో లోపు ఆ వ్యర్ధాలను తొలగిస్తామని జీహెచ్‌ఎంసీ పిటిషన్‌ ద్వారా హైకోర్టుకు తెలియజేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం భోజనవిరామం తరువాత విచారణ చేపట్టే అవకాశం ఉంది.