సంబంధిత వార్తలు

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చాకలి ఐలమ్మ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాయపర్తి 1895, సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. ఆమె భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీర వనితగా చరిత్రలో నిలిచింది. ఆమె బందగీ తర్పణంతో ఎరుపెక్కించి పోరుజెండాతో అప్పటి దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె 1985, సెప్టెంబర్ 10న పరమపదించారు.