
వచ్చేనెల 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ షిప్ క్రికెట్ మ్యాచ్‌లు యూఏఈ, ఓమన్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ టీ-20 ప్రపంచ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్‌లు భారత్‌లోనే జరగాల్సి ఉంది కానీ కరోనా నేపథ్యంలో యూఏఈ, ఓమన్‌లో నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ సంస్థ(బీసీసీఐ) ప్రపంచ కప్ కోసం భారత్ జట్టుని ప్రకటించింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత్ జట్టుకి మెంటర్ (మార్గదర్శకుడు)గా, రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.
భారత్ జట్టు వివరాలు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, కిషన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ.