సంబంధిత వార్తలు

ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలో పేద మహిళలకు ప్రభుత్వం రెండు చీరలు చొప్పున పంచిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.333.14 కోట్లు బుదవారం విడుదల చేసింది. ఈసారి నేతన్నలు 17 రంగులలో, 15 డిజైన్లతో చీరలను నేసీ సిద్దం చేశారు. వచ్చే నెలలో జరుగబోయే బతుకమ్మ పండుగ సందర్భంగా తెల్లారేషన్ కార్డు కలిగి 18 ఏళ్ళు పైబడిన సుమారు కోటి మంది మహిళలకి బతుకమ్మ చీరలు ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే నెల మొదటి వారంలోగా బతుకమ్మ చీరల పంపిణీ పూర్తిచేసేందుకు చేనేత, పౌరసరఫరా శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.