కెఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకవుట్

ఈరోజు హైదరాబాద్‌లో జలసౌధ భవన్‌లో కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. దానిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌ శ్రీశైలం ప్రాజెక్టులో సాగు,త్రాగు నీటి అవసరాలున్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, మిగిలిన సమయంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి జలాశయంలో నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయించిన వాటాల ప్రకారం పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపి నిరసన తెలియజేస్తూ ఆయనతో సహా తెలంగాణ అధికారులందరూ సమావేశం నుంచి వాకవుట్ చేశారు. దీంతో 5 గంటలకు పైగా సాగిన కేఆర్‌ఎంబీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.  

ఈ సమావేశం ముగిసిన తరువాత కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం మొదలైంది. దానిలో కూడా రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొని, కృష్ణా, గోదావరి బేసిన్లపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులను బోర్డులకు అప్పజెప్పాలనే కేంద్రప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చిస్తున్నారు.