దళిత బంధుకి నిధుల ప్రవాహం

దళిత బంధు పథకానికి నిధుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈనెల 16న హుజూరాబాద్‌లో ఈ పధకం పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందజేయనున్నట్టు సీఎం ప్రకటించారు. దళిత బంధు పథకం కింద తొలి విడతలో రూ.500 కోట్లు, సోమవారం రెండో విడతలో రూ.500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా ఈ రోజు మరో రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పథకానికి ఇప్పటివరకు మొత్తంగా రూ.1,200 కోట్లు కేటాయించినట్లయింది.