తెలంగాణ బీసీ కమీషన్‌కు ఛైర్మన్‌గా వకుళాభరణం

తెలంగాణ బీసీ కమీషన్‌కు నూతన కార్యవర్గ సభ్యులను, ఛైర్మన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమీషన్‌ ఛైర్మన్‌గా డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావును, సభ్యులుగా కిషోర్ గౌడ్, శుభప్రద పాటిల్, ఉపేంద్రలను నియమించింది. డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు ఇదివరకు బీసీ కమీషన్‌లో సభ్యుడిగా చేశారు.  ఇటీవల హుజూరాబాద్‌కు చెందిన బండారు శ్రీనివాస్‌ను ఎస్సీ కమీషన్‌కు ఛైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్‌ ఉపఎన్నిక నేపధ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్‌ నేతలకు కీలక పదవులు  లభిస్తుండటంతో మిగిలిన టిఆర్ఎస్‌ నేతలు కూడా పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.