2.jpg)
నాంపల్లి ఎగ్జిబిషన్ (నుమాయిష్) సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఇంతకు ముందు ఈటల రాజేందర్ దానికి అధ్యక్షుడుగా ఉండేవారు. ఆయన టిఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆ పదవిని కూడా విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయన స్థానంలో మంత్రి హరీష్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన సొసైటీ పాలకమండలి సభ్యులతో మాట్లాడుతూ, సిఎం కేసీఆర్ సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేసి వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్‌ను అద్భుతంగా నిర్వహిద్దామని అన్నారు. సొసైటీ అధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థ ద్వారా పేద విద్యార్దులకు నాణ్యమైన విద్య లభిస్తున్నందుకు మంత్రి హరీష్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.
సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన కొన్ని రోజులకు సొసైటీలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ అధికారులు సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించి, సొసైటీ కార్యదర్శిని సిబ్బందిని ప్రశ్నించారు. మళ్ళీ ఆ తరువాత ఆ కేసు ప్రస్తావన వినపడలేదు. మళ్ళీ ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నికకు ముందు మంత్రి హరీష్‌రావు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికవడం యాదృచ్చికమా లేదా ఈటల రాజేందర్ మెడకు సొసైటీ ఉచ్చు బిగించేందుకా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.