తెలంగాణ పోలీస్ శాఖకు రెండు రాష్ట్రపతి సేవా పతకాలు

తెలంగాణకు చెందిన ఇద్దరు పోలీసులకు రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాలు వరించాయి. ప్రతి ఏటా భారత్‌ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక పోలీసు అధికారులకు వివిధ పతకాలు ఇచ్చి గౌరవించడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికిగాను కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు చెందిన1,380 మందికి వివిధ పతకాలు ప్రకటించింది. ఇందులో ఇద్దరికీ రాష్ట్రపతి అత్యున్నత పతకాలు, 628 మంది శౌర్య  పోలీసుల పతకాలు, 662 మంది కి విశిష్ట సేవా పతకాలున్నాయి. 

ఈ జాబితాలో తెలంగాణకు చెందిన 14 మంది పోలీసు అధికారులకు శౌర్య పోలీస్ పతకాలు, 11 మందికి ఉత్తమ సేవా పోలీస్ పతకాలు దక్కాయి. అడిషనల్ డిజిపి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్  స్వాతి లక్రా, జనగామ వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బండ ప్రకాష్ రెడ్డి రాష్ట్రపతి సేవా పతకాలు ను అందుకోనున్నారు.