మహిళా ట్రైనీ ఎస్‌ఐపై ఎస్సై అత్యాచారయత్నం!

మహబూబాద్ జిల్లాలోని మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తనపై అత్యాచారాయత్నం చేశాడని ఓ ట్రైనీ ఎస్‌ఐ వరంగల్‌ పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తనను శిక్షణలో భాగంగా మంగళవారం రాత్రి అడవికి తీసుకువెళ్లి తనపై అత్యాచారం చేయబోతే తప్పించుకొని వచ్చానని ఆమె తెలిపింది.

మరియమ్మ లాకప్ డెత్ కేసుతో తీవ్ర అప్రతిష్ట పాలైన తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు ఎస్‌ఐ శ్రీనివాస్ రెడ్డి తోటి మహిళా ఎస్సైపైనే అత్యాచారయత్నం చేయడం నిజమైతే ఇది మరింత అప్రదిష్ట కలిగించే విషయమే.   

మరియమ్మ కేసులో అడ్డగూడూరు ఎస్సై వి.మహేశ్వర్, కానిస్టేబుల్స్ ఎంఏ రషీద్, పి.జానయ్యలను విధులలో నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.