ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త,
వ్యాపారవేత్త నీలి చిత్రాలు (పోర్న్ మూవీస్) తీస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన సంగతి
తెలిసిందే. జూలై 19న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి
ఆయన పోలీస్ కస్టడీలోనే ఉంటున్నారు. నేటితో ఆయన కస్టడీ ముగియడంతో పోలీసులు మళ్ళీ ఆయనను
ముంబై కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి జ్యూడీషియల్
కస్టడీని మరో రెండు వారాలపాటు పొడిగించింది. కనుక ఆయన న్యాయవాది హైకోర్టులో బెయిల్
పిటిషన్ వేశారు. దానిపై రేపు విచారణ జరగనుంది. సినిమాలలో నటించాలని వచ్చేవారినే లక్ష్యంగా
చేసుకొని రాజ్ కుంద్రా వారి అశ్లీల చిత్రాలు తీస్తున్నారని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు.
ఈ కేసులో ఆయన భార్య శిల్పాశెట్టిని కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు.
అయితే తాను, తన భర్త అమాయకులమని, అసలు ఇటువంటి
వ్యవహారాలతో తమకు సంబంధమే లేదని ఆమె చెప్పుతున్నారు. కానీ ఆయన తరపు ఈ కేసును వాదిస్తున్న
న్యాయవాది నీలిచిత్రాలకు, శృంగారానికి మద్య చాలా తేడా ఉందని, తన క్లయింట్ తీస్తున చిత్రాలు శృంగారమైనవే తప్ప నీలిచిత్రాలు కావని వాదించడమే
రాజ్ కుంద్రా ఈ నీలిచిత్రాల నిర్మాణంలో ఉన్నారని స్పష్టం చేస్తోంది.