సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సింగరేణిలో పనిచేసే కార్మికులు, అధికారుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచాలని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం, సింగరేణి ప్రాంతాల ఎమ్మెల్యేలు పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తూ సింగరేణిలో పనిచేసే కార్మికుల, అధికారుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26వ తేదీన సింగరేణి బోర్టు సమావేశం నిర్వహించి చర్చించిన తర్వాత దీనిని ఎప్పటి నుంచి అమలుచేయబోతున్నారో తేదీని ప్రకటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న 45,079 మంది కార్మికులు, అధికారులకు ప్రయోజనం చేకూరనుంది.