
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరిపోవడంతో, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆయన స్థానంలో పార్టీలో సీనియర్ నేత బక్కని నర్సింహులును నియమించారు. మాదిగ సమాజిక వర్గానికి చెందిన నర్సింహులు మహబూబ్‌నగర్ జిల్లా టిడిపి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 1994-99 మద్య షాద్‌నగర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన కొంతకాలం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో సభ్యుడిగా కూడా చేశారు.
తెలంగాణలో టిడిపి మనుగడ సాగించగలదేమో కానీ ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా దాని పరిస్థితిలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు. చంద్రబాబునాయుడు, లోకేశ్ ఇద్దరూ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో తమ పార్టీని కాపాడుకోలేకపోతున్నారు. ఏపీలో కూడా టిడిపి తీవ్ర రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటూ మనుగడ కోసం పోరాడుతోంది.