సిఎం కేసీఆర్‌ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారు

ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ రూపొందించాలనే సిఎం కేసీఆర్‌ నిర్ణయం చాలా సాహసోపేతమైనదని మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దీంతో ప్రభుత్వంపై చాలా భారం పడుతుందని అయినా సిఎం కేసీఆర్‌ వెనకడుగు వేయలేదని అన్నారు. ఇక నుంచి తన శాఖలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఖాళీలను గుర్తించి నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పదోన్నతులు, రిటైర్మెంట్‌ల వలన ఖాళీ అయ్యే పోస్టులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబందించి ఖాళీలను కూడా నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు. కొత్త జిల్లాలు, వాటిలో జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.