
ఈటల రాజేందర్ రాజీనామాతో జరుగబోతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక టిఆర్ఎస్, బిజెపిలకు అలాగే సిఎం కేసీఆర్, ఈటల రాజేందర్‌లకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఇంతకాలం ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్లిపతతో వ్యవహరించిందనే చెప్పవచ్చు. కానీ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టగానే హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి సారించి, నియోజకవర్గం, మండలాలు, మున్సిపాలిటీలకు ఇన్-ఛార్జీలను నియమించారు.
ఈ నియోజకవర్గానికి పిసిసి ఇన్-ఛార్జీగా దామోదర నర్సింహను నియమించారు. ఎన్నికల సమన్వయ కర్తలుగా జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను నియమించారు.
ఇక హుజురాబాద్ మండలానికి తూముకుంట నర్సారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హుజురాబాద్ మున్సిపాలిటీకి బొమ్మ శ్రీరాం చక్రవర్తి, జువ్వాడి నర్సింగరావు, కమలాపూకుర్ కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య, వీణవంకకు ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్, జమ్మికుంటకు విజయరమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్
జమ్మికుంట మున్సిపాలిటీకి సిరిసిల్ల రాజయ్య, ఈర్ల కొమరయ్య, ఇల్లందకుంటకు నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలను ఇన్-ఛార్జీలుగా నియమించారు. ఇక అభ్యర్ధిని ప్రకటించడమే మిగిలుంది. ఈసారి సొల్లు కబుర్లతో కాలక్షేపం చేసేవాడిని కాకుండా బలమైన అభ్యర్ధిని బరిలో దింపబోతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.