సంబంధిత వార్తలు

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 14వ తేదీన హుజూరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేయనున్నారని ప్రకటించారు. వారితో పాటు సుమారు 2,000 మంది కార్యకర్తలు కూడా పార్టీ విడిచిపెట్టి తమతో టిఆర్ఎస్లో చేరబోతున్నారని ప్రకటించారు. తాను ఈనెల 16న ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలలో ఈటల రాజేందర్‌ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు.