సంబంధిత వార్తలు
34.jpg)
ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరుగబోయే ఈ సమావేశంలో జూలై 1 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు జరిగినే తీరుపై చర్చిస్తారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో ఒకవేళ వస్తే ఏవిదంగా ఎదుర్కోవాలి...దానికి ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇవికాక వ్యవసాయం, స్కూళ్ళు, కాలేజీలు పునః ప్రారంభించడం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.