విశ్వనగరం చేసి చూపిస్తామని చివరకు హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చారని టిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు బిజెపి నేత కిషన్ రెడ్డి. గత రెండు రోజుల వర్షం కారణంగా అస్తవ్యస్థంగా మారిన హైదరాబాద్ పరిస్థితిపై ఆయన ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ప్రకటించిన వంద రోజుల కార్యాచరణ ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. నాళాల పూడిక కూడా తియ్యనందు వల్లే నాలుగు గంటల వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైందని అన్నారు.
విశ్వనగరం పేరుతో టి సర్కార్ మోసం చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అవార్డు తీసుకోవడం తప్ప హైదరాబాద్ కు చేసిందేమీ లేదని ఆయన అన్నారు. రోడ్ల పరిస్థితిపై కేటీఆర్ గారికే విసుగుపుడితే హైదరాబాద్ వాసుల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. వెంటనే నాళాల పూడిక తియ్యాలని.. అలాగే నష్టనివారణ చర్యలకు దిగాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.