విభేదాలకు పుట్టినిల్లైనా కాంగ్రెస్‌లో మరో లొల్లి షురూ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ తర్వాత కాంగ్రెస్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కలిసి మెలిసి పని చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి మెజారిటీని తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు అంతా కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో కలిసి కట్టుగా లేకుండా కుమ్ములాడుకుంటూ పార్టీకి మరింత నష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లోకి జాయిన్ అవ్వగా, మరి కొందరు సైతం కాంగ్రెస్‌ను వదిలేందుకు సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఇటీవలే జానారెడ్డి అధికార పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ పాలన మరియు ప్రభుత్వ పనితీరుపై జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగించేలా మాట్లాడాడు. దాంతో కాంగ్రెస్‌కు చెందిన పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి సమయంలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం ఏంటని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల అన్నాడు. ఎవరి నాయకత్వంలో అయినా పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ నాయకులు అంతా కూడా ఇలా ఉంటేనే భవిష్యత్తులో మంచి జరుగుతుందని పొన్నాల అన్నారు.