చెప్పినట్టుగానే ఈరోజు తిరుపతి లో పవన్ కళ్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన ప్రసంగం లోని హైలైట్స్ ఇవే:
- నాకు కులాలు, మతాలు అంటగట్టకండి. నా కులం మానవత్వం
- నేనెప్పుడు ప్రశ్నిస్తానని చాలా మంది అడిగారు. నేనిప్పటి నుండి ప్రశ్నిస్తా
- ఏ పార్టీ తో చేతులు కలపను. జనసేన ను జాతీయ పార్టీని చేయమని కొందరు అడిగారు, కానీ నా తెలుగు ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పి నేను ఆగిపోయా.
- ప్రత్యేక హోదా పై చర్చ ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం. నేను ప్రత్యేక హోదా కోసం మూడు స్టేజీలలో పోరాటం చేస్తాను.
- మొదటి స్టేజి: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి, ప్రభుత్వాల పనితీరు పై ప్రజల అభిప్రాయం కనుక్కుంటాను.
- రెండవ స్టేజి: రాష్ట్ర, మరియు కేంద్ర ఎంపీల వద్దకు వెళ్లి వారిపై ఒత్తిడి తెస్తాను. అప్పటికీ ప్రయోజనం లేకుంటే
- మూడవ స్టేజీ: నా అభిమానుల అండదండలతో, జనసేన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తాను.
- మాట్లాడేందుకు సరైన సమయం సందర్భం చూస్తాను తప్ప మాట్లాడే ధైర్యం లేక కాదు.
- సెప్టెంబర్ 9న కాకినాడ లో జనసేన పార్టీ కి సంబంధించి పెద్ద ప్రజా సభ ఉంటుంది.
- ప్రత్యేక హోదా పోరాటంలో నా మెడ తెగి ముందుకి పడాలి తప్ప, అడుగు మాత్రం వెనక్కి పడదు.
- నా అభిమానులే నా ధైర్యం. మీరు లేకుంటే నేనొక్కడ్ని ఏమీ చేయలేను.
- డబ్బులు లేవు గనక సినిమాలు చేస్తాను, మరో వైపు రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాను.
- చివరగా పవన్ ఇచ్చిన స్లోగన్: "లడేంగే లడేంగే హమ్ జీత్ నే తక్ లడేంగే"