కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం తనను ఎన్నికల నుంచి తప్పుకోమని బెదిరించాడని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సభలో ఆయన మాట్లాడుతూ, తాను గతంలో ఎమ్మెల్సీగా పోటీలో నిలబడినప్పుడు పోటీలోంచి తప్పుకోమని నయీం ఒత్తిడి చేశాడన్నారు. ఈ సందర్భంగా నయీం మనుషులు తనను బెదిరించారని ఆయన తెలిపారు. నయీం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
2009 నుంచి నయీమ్ అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఎం.ఎల్.సి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో ఆయన మాట్లాడుతూ, నయీమ్ తో చాలా మంది రాజకీయ నాయకులకు లింకులున్నాయని వార్తా కథనాలు వెలువడుతున్నాయని అన్నారు. గుండాలతో స్నేహం చేసిన రాజకీయ నాయకుల గురించి ప్రజలకు తెలియాలని, తక్షణం వారి పేర్లు వెల్లడించి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నయీమ్ ను ఎన్ కౌంటర్ చేసి ప్రభుత్వం మంచి పని చేసిందని ఆయన చెప్పారు.
నయీమ్ అరాచకాలు 2009 నుంచి పెరిగిపోయాయని ఆయన అన్నారు. సంఘవిద్రోహ శక్తులుగా మారిన వ్యక్తులతో స్నేహం చేసిన రాజకీయ నాయకుల గురించి ప్రజలకు తెలపాల్సిన అవసరముందని ఆయన డిమాండ్ చేశారు. 2009లో తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు నయీమ్ తో ఏం లొసుగులు ఉండి అతనిని ఉపేక్షించారో తనకు తెలియదని ఆయన చెప్పారు. నయీమ్ కారణంగా నిరుపేదలు నష్టపోయారని, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ నేతలను రక్షించే ప్రయత్నంలో కేసును నీరుగార్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన అన్నారు.
ఇక నయీమ్ ముఖ్య అనుచరుడు శేషన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు, శేషన్న కనుసన్నల్లోనే నయీమ్ అక్రమాలు సాగాయని, అతను చిక్కితే నయీమ్ అక్రమాలు మరిన్ని వెలుగుచూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, నయీం అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. నయీం ఎన్ కౌంటర్ కావించబడ్డప్పటికీ, ఆ పాపాలుడు సంపాదించిన ఆస్తులు కాపాడుకునేందుకు వాడి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పలువురు వెనుకాడుతున్నట్టు తెలుస్తోంది. వారిని కూడా అదుపులోకి తీసుకుంటే మరింత మంది బయటకు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.