మావోయిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. తరువాత కోవర్టుగా మారి.. పోలీసులచేత పెంచి పోషించబడినట్లు అరోపణలు ఎదుర్కొని.. వారి చేతిలోనే హతమైన గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీం ఆస్తుల వివరాలు తెలుసుకుని తెలంగాణ పోలీసులు షాక్ కు గురయ్యారు. ముంబై మాఫియాను మించిన ఆస్తులను నయామ్ అక్రమ మార్గంలో సంపాదించాడని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. సమసమాజ స్థాపన కోసం నక్సల్ ఉద్యమంలో చేరిన నయీమ్.. ఉద్యమానికి తూట్లు పోడిచి గ్యాంగ్ స్టర్ గా ఎదిగి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది.
తొలుత పోలీసులు సహాకారంతోనే కోవర్టుగా మారిన నయీమ్.. అప్పటి నుంచి వక్రమార్గం పట్టి అస్తులను కూడబెట్టడం ప్రారంభించినట్లు తెలంగాణ పోలీసులు తేల్చారు. నయీమ్ ఇళ్లు, గెస్ట్ హౌజ్ లలో నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడం ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.
నయీం ఆస్తుల వివరాలు
కొండాపూర్ లో ఒకే చోట 69 ఎకరాల భూమి.. దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైనే
పుప‍్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చు
నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామారంలో 500 ఎకరాలు
హైదరాబాద్ నగరంలో పదులుకొద్దీ ఫ్లాట్లు
ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు
ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు
సరూర్ నగర్ లోని ఎన్టీఆర్ నగర్ లో 1180 గజాల సైటు ప్లాను స్వాధీనం
గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు స్వాధీనం
అత్తాపూర్ లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు గుర్తింపు
కొండాపూర్ లో సర్వే 87 పత్రాలు స్వాధీనం
షేక్ పేట్ లో మరో ఫ్లాటు పత్రాలు స్వాధీనం
ముసారాబాద్ లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తింపు
జూబ్లిహిల్స్ లో 1365 గజాల స్థలం కబ్జా
భువనగిరిలోనే 175 ఫ్లాట్ల డాక్యుమెంట్లు గుర్తింపు
ఘట్ కేసర్, రామంతపూర్ గౌలిపుర, అమీన్ పుర ప్రాంతాలకు చెందిన భూమి పత్రాలు స్వాధీనం
ఆయుధాలు, ఫోన్లు
ఇప్పటివరకు 4 పిస్టల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఎఫ్ఐఆర్
వేర్వేరు కంపెనీలకు చెందిన 258 సెల్ ఫోన్లు స్వాధీనం
డైరీలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు, మెమొరీ కార్డుల, ల్యాప్ టాప్ లు స్వాధీనం
అవు గట్టున మేస్తే.. దూడ..? పనిమనుషులు కూడా అంతే..!
ఇదిలావుండగా ఆయన ఇంట్లో పనిచేసే పనిమనుషులు నయీమ్ చనిపోయాడన్న వార్త తెలుసుకుని డబ్బుతో జారుకోవాలని ప్రయత్నించారు. ఆయుధాలతో అనుమానాస్పందంగా సంచరిస్తున్న వీరిని, అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎదుట వీరు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. నయీమ్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా.. అమెతో పాటు కారు డ్రైవర్ భార్య అఫ్షాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో ఫర్హానా ఏం చెప్పిందంటే.. 'నా భర్త మరణించాక నయీం దగ్గర వంటమనిషిగా చేరాను. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నన్ను నయీం బంధువు హైదరాబాద్ కు తీసుకొచ్చాడు. నాతో పాటు అఫ్షా అనే మహళ నయీం ఇంట్లో పనిచేసేది. అతని కుటుంబ సభ్యులను, పిల్లలను చూసుకునేవాళ్లం. నయీంకు మాపై నమ్మకం ఉండేది. అఫ్షాతో కలసి టీవీ చూస్తుండగా నయీమ్ హతమైన వార్త తెలిసింది. వెంటనే అక్కడ నుంచి కొంత నగదుతో బయటపడాలనుకున్నాం. అయితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు' అని చెప్పింది.