మోదీతో కేసీఆర్ అదే మాట్లాడేవారట

సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమేనని, సంకల్పంతోనే పనులు పూర్తవుతాయని..సిఎం కెసిఆర్ సంకల్పంతో మిషన్ భగీరథ విజయవంతమవుతోందని మోదీ వెల్లడించారు. తెలంగాణ దేని కోసం ఏర్పిడిందో ఆ ఆకాంక్ష నెరవేరుతుందని ఆశిస్తున్నామన్నారు. జిఎస్‌టి బిల్లుకు మద్దతు తెలిపినందుకు కెసిఆర్ కి, టిఆర్‌ఎస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు మోదీ. కెసిఆర్ కలిసినప్పుడల్లా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడేవారని గుర్తు చేశారు. సాగు నీటి గురించి మాట్లాడినప్పుడు ఎంతో ఉద్వేగంగా మాట్లాడారన్నారు. 

‘కృషి సించాయ్ యోజన’ రైతుల కలలను నిజం చేస్తోందని చెప్పారు. రైతులందిరికీ నీళ్లందితే మట్టి నుంచి బంగారం పండిస్తారని ఆయన పేర్కొన్నారు. నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, నీళ్లు లేనప్పుడే దాహం విలువేంటో తెలుస్తోందని గుర్తు చేశారు. నీళ్లు పొదుపు చేస్తేనే, నీళ్లొస్తయన్నారు. వర్షపు నీటిని పొదుపు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పడితేనే భవిష్యత్ ఉంటుందని, ప్రతీ నీటి బొట్టు వ్యవసాయానికి మళ్లిస్తే, గ్రామాల జీవన ప్రమాణం పెరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే రైల్ కనెక్టివిటీ పెరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఫెర్టిలైజర్ కర్మాగారం లేదు, అందుకే రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.