తెలంగాణలో తీవ్ర దుమారానికి తెర తీసిన ఎంసెట్ పరీక్షాపత్రంపై కేసీఆర్ కు ముందే తెలుసా అనే ప్రశ్న తలెత్తుతోంది. ముందు నుండి కూడా జాతకాలు, వాస్తులను బాగా నమ్మే కేసీఆర్ కు అదే జాతకం ముందుగా హెచ్చరించినట్లే జరిగింది అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేసీఆర్ సర్కార్ కు రానున్న కాలంలో కొన్ని క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని పంచాంగంలో ఉంది అనే విషయం ఇప్పుడు తెలంగాణ సర్కిల్స్ లో చర్చకు తెర తీసింది.
ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రవీంద్రభారతి పంచాంగశ్రవణం ఏర్పాటు చేయించింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులందరూ హాజరై శ్రవాణాన్ని విన్నారు. ఇందులో పండితులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని తెలిపారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంలో విద్యా, వైద్య ఆరోగ్యశాఖల్లో ఒడిదుడుకులు సంభవిస్తాయని పండితులు శ్రవణం పాటించారు.
అనంతరం దీనిపై కేసీఆర్ తన ప్రసంగంలో వివరించారు.. ‘మా మంత్రులు కడియం.. లక్ష్మారెడ్డిలు పనిమంతులు.. వారికే పంచాంగ శ్రవణం షాకిస్తోంది.. వైద్య, విద్యా శాఖలు నిర్వహించే వారు జర జాగ్రత్తగుండాలే.. అభాసుపాలవుతామని పంచాంగ చెబుతోంది.. జర జగ్రత్త’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు.. కాగా ఇప్పుడు ఆ పంచాంగం అక్షర సత్యం అయ్యింది.. వైద్య, విద్యాశాఖల సమ్మేళనమైన ఎంసెట్2 పేపర్ లీక్ అయ్యింది. అది రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సచివాలయం వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మంత్రులను నిలదీస్తున్నారు. దీంతో పాటు కడియం, లక్ష్మారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉగాది సందర్భంగా పండితులు చెప్పిన పంచాంగం రుజువైందని సర్వత్రా వ్యక్తమవుతోంది. కేసీఆర్ అనాడే హెచ్చరించాడని.. అయినా మంత్రులు త్వరపడలేదని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నాయి.