వీసీల నియామకంపై హైకోర్టు సీరియస్

తెలంగాణ సర్కార్ తొందరపాటుగా వ్యవహరించింది. ఎంతో కాలంగా మీనమేషాలు లెక్కించిన టీ సర్కార్ రాత్రికి రాత్రి చేసిన అతి కారణంగా హైకోర్టు సర్కార్ పై అక్షింతలు వేసింది. ఇన్ని రోజులుగా వేచి చూస్తూ వచ్చిన సర్కార్ కు రెండు మూడు రోజులు కూడా ఆగే ఓపిక లేదా అని ప్రశ్నించింది. అసలు హైకోర్టు అంతలా ఆగ్రహించాల్సిన పని సర్కార్ ఏం చేసింది అనుకుంటున్నారా..? వీసీలను నియమించడం.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్నా చాలా యూనివర్సిటీలకు వీసీలు లేరు. ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న విసీ పోస్టులను భర్తీ చేస్తే ఉత్తర్వులు జారీ చేసింది. తొమ్మిది మంది వీసీలను నియమిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా గుర్తుకు రాని వీసీల నియామకంపై నాలుగు రోజులు ఎందుకు ఆగలేదు అని ప్రశ్నించింది. వీసీల నియామకాల కోసం నిబంధనలను సడలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు ఫైలైంది. ఆ కేసు కోర్టులో విచారణ సాగుతుండగానే తెలంగాణ సర్కార్ తొమ్మిదిమంది విసీలను నియమించడం హైకోర్టుకు ఆగ్రహం తెప్పించింది.