ఇంటర్నెట్ వరల్డ్ లో ప్రత్యేకతను చాటుకున్న టాప్ కంపెనీల్లో యాహూ ఒకటి. తాజాగా యాహూ కంపెనీ వెరిజోన్ కమ్యూనికేషన్ మధ్య 4.83 బిలియన్ డాలర్లకు ఓ భారీ ఒప్పందం కుదిరింది. చాలా కాలం నుండి యాహూ టాప్ ప్లేస్ నుండి తప్పుకోవడం కంపెనీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. గతంలో ఇంటర్నెట్ ను ఊపేసిన యాహూ ఇక మీదట చరిత్రలో కలవనుంది. అమెరికాకు చెందిన టెలికాం కంపెనీ వెరిజోన్ కమ్యూనికేషన్స్ మధ్య కొనుగోలుకు అగ్రిమెంట్ కుదిరింది.
గత 20 సంవత్సరాలుగా తన సర్వీసులను అందిస్తున్న యాహూకు చెందిన యాహూ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మెయిల్, మెసెంజర్, సెర్చ్ తో సహా అన్ని వెరిజోన్ సొంతం కానున్నాయి. యాహూను వెరిజోన్ సుమారు 32,491.41కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం యాడ్స్ కోసం ఓ ప్లాట్ ఫాం తయారుచెయ్యడానికి యాహూ పై కన్నేసింది. గత సంవత్సరం యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్‌ను 4.4 బిలియన్ డాలర్స్ తో వెరిజోన్స్ కొనుగోలు చేసింది. ఒకప్పుడు గూగుల్ కు పోటీగా నిలిచినా కానీ తర్వాత మాత్రం పోటీలో వెనుకడుగేసింది. కొత్త ఫీచర్స్ ను అందించడంలో గూగుల్ తో యాహూ పోటీ ఇవ్వలేకపోయింది.