ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారు

ప్రధాని మోడీ ఆగస్ట్ 7న తెలంగాణకు రానున్నారు. గతవారం సీఎం కేసీఆర్ స్వయంతో ప్రధానిని కలిసి అభివృద్ది పథకాల శంకుస్థాపనకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధాని టూర్ పై పీఎంఓ.. తెలంగాణ సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. ఒక్కరోజు పర్యటనలో భాగంగా ప్రధాని మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పీఎం టూర్ కు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ది పనులను పీఎంకు వివరించనుంది.

ప్రధాని మోడీ మొదటగా మెదక్ జిల్లా గజ్వేల్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కరీంనగర్ జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ ప్లాంట్, ఎరువుల కర్మాగారానికి శంకుస్థాపనలు చేయనున్నారు.. అనంతరం వరంగల్ లో టెక్స్ టైల్స్ పార్క్ కు పునాదిరాయి వేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు. ఇక ఎఫ్ సీఐ పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. వరంగల్ లో మిషన్ కాకతీయ పైలాన్ ను ఆవిష్కరిస్తారు.