తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. నిన్న సాయంత్రం విడుదల చేసిన ఫలితాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మొత్తం 10 డిపోలు ఫలితాలు విడుదల చేయగా అందులో తొమ్మిది డిపోలలో టీఎంయు గెలవగా మిగిలిన ఒక్క దాంట్లో వేములవాడ డిపోలో ఈయూ గెలిచింది. నల్లగొండ, వరంగల్ లోని పూర్తి 8 డిపోల చొప్పున టీఎంయూ విజయకేతనం ఎగరవేసింది ..ఇక ఖమ్మం జిల్లాలో పూర్తి 4 డిపోలలో విజయంతో పాటు, ఎస్.ఢబ్యూ.ఎఫ్ మరియు ఈయు కూటమి విజయకేతనం ఎగరవేసింది .
మెదక్ జిల్లాలో ఉన్న మొత్తం 7 డిపోలలో టీఎంయూ విజయకేతనం ఎగరవేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4 డిపోలలో 3 డిపోలలో టీఎంయూ విజయకేతనం ఎగరవేసింది. మిగిలిన ఒక్క డిపోలో ఎన్.ఎం.యు విజయం సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 8 డిపోలు ఉండగా అందులో 6 డిపోలలో టీఎంయూ విజయకేతనం ఎగరవేసింది. మిగిలిన రెండు డిపోలలో వేరే గుర్తింపు సంఘం విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 4 డిపోలలో 3 డిపోలలో టీఎంయూ విజయకేతనం ఎగరవేసింది ..ఒక్క డిపోలో ఎన్.ఎం.యు సాధించింది .
రీజియన్ల వారీగా టీఎంయూకు లభించిన మెజారిటీ :
ఆదిలాబాద్లో 836, కరీంనగర్లో 1,394, వరంగల్లో 988, మహబూబ్నగర్లో 1,780, రంగారెడ్డిలో 1,189, నల్లగొండలో 1,522, సంగారెడ్డిలో 1,191, నిజామాబాద్లో 747, నాన్ఆపరేషన్ యూనిట్ హైదరాబాద్ 224, నాన్ ఆపరేషన్ యూనిట్ కరీంనగర్ 78, ఖమ్మం రీజియన్లో 634, హైదరాబాద్లో 3,178, సికింద్రాబాద్ రీజియన్ 3,533 ఓట్లు కలిపి, టీఎంయూకు 17,294 ఓట్ల మెజారిటీ లభించింది.