రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగనున్నాయి. రేపు ఉదయం 11.30 గంటలకు శాసనసభ, మండలిలో తాత్కాలిక బడ్జెట్‌ (ఓటాన్ అకౌంట్) ప్రవేశపెట్టబడుతుంది. ఆదివారం దానిపై చర్చ జరిపి సోమవారం దానికి ఉభయసభలు ఆమోదం తెలుపుతాయి. 

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిన్న స్పీకర్ ఛాంబర్‌లో సమీక్షా సమావేశం జరిగింది. దానిలో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, హైదరాబాద్‌ నగ ర పోలీస్‌ కమిషనర్‌ అంజనాకుమార్, ఎస్‌టీఎఫ్‌ డీజీ తేజ్‌దీప్‌కౌర్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పోలీసు అధికారులు పాల్గొన్నారు.