తెలంగాణ మంత్రుల్లో కెటిఆర్ మాటతీరు, పనితీరు ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అమెరికా వెళ్లి ఆపిల్ లాంటి కంపెనీల్లో స్పీచ్ లు ఇచ్చినా, హైదరాబాద్ బస్తీల్లో హరితహారంపై స్పీచ్ ఇచ్చినా తన మార్క్ తో దూసుకెళతారు. అలాంటి మంత్రి కెటిఆర్ కు తాజాగా శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ఆగస్ట్ 11, 12 తేదీల్లో జరిగే హ్యూమన్ క్యాపిటల్ సమ్మిట్ లో పాల్గొనాలని కోరుతూ శ్రీలంక ప్రభుత్వం కెటిఆర్ కు ఆహ్వానం పంపింది. దేశవిధానాలు, శిక్షణా కార్యక్రమాలు, ఉద్యోగ యువత సంసిద్ధం అంశాలపై శ్రీలంక ప్రధాని విక్రమ సింఘే తోపాటు కెటిఆర్ కూడా ఈ సమ్మిట్ లో ప్రసంగించనున్నారు.
శ్రీలంక ఆహ్వానం పై కెటిఆర్ స్పందిస్తూ.. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శిక్షణా, నైపుణ్య కార్యక్రమాలను శ్రీలంకలో వివరిస్తానని అన్నారు. ఇప్పటికే ఆయన ప్రసంగాలకు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్రమంత్రుల నుంచి కెటిఆర్ ప్రశంసలను అందుకున్నాడు.