రాష్ట్రంలో మరో 2 రెవెన్యూ డివిజన్లు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెరాస సర్కార్ ఆ రెండు జిల్లాలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 

జగిత్యాల జిల్లాలో కోరుట్లను రెవెన్యూ డివిజన్ గా చేయబోతోంది. దానిలో కోరుట్ల, మేడిపల్లి, కధాలాపూర్ మండలాలు ఉంటాయి. 

నాగర్ కర్నూల్ జిల్లాలోని ఏర్పాటు చేయబోతున్న కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొల్లాపూర్, పెంట్లవెళ్ళి, కోడేరు మండలాలు ఉంటాయి. 

వీటి ఏర్పాటుపై 30 రోజులలోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్లకు సమర్పించవచ్చు. వాటిని పరిశీలించి, అర్హమైనవాటిని పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఖరారు చేస్తుంది.