తెరాస కార్యకర్తలపై వేటు

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌, తెరాస పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు వివిద కారణాలతో తమ ప్రత్యర్ధి పార్టీ బలపరిచిన అభ్యర్ధులకు మద్దతు ఇచ్చి సొంత పార్టీ అభ్యర్ధుల ఓటమికి కారకులయ్యారు. కనుక పంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అటువంటివారిపై రెండు పార్టీలు వేటు వేస్తున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్ పూర్ మండలంలో గల ఇప్పలగూడెంకు చెందిన ఏడుగురు తెరాస కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు గట్ల మల్లారెడ్డి ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్లారెడ్డి చెప్పారు. బహిష్కరణకు గురైన కార్యకర్తలు ఇప్పటి వరకు పార్టీ నుంచి అనేకవిధాలుగా లబ్ది పొందారని కానీ పంచాయతీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ బలపరిచిన అభ్యర్ధి ఓటమికి కారకులయ్యారని, అటువంటి ద్రోహులకు పార్టీలో స్థానం లేదని అందుకే వారిని బహిష్కరిస్తున్నామని  విలేఖరులకు తెలిపారు. 

కాంగ్రెస్‌ పార్టీ కూడా ఇప్పటికే కొంతమందిపై వేటు వేసింది. ఆవిధంగా బహిష్కరణకు గురైనవారు వెంటనే ప్రత్యర్ది పార్టీలలో చేరిపోతున్నారు కనుక రెండు పార్టీలలో ఏర్పడిన ఖాళీలు వారితో భర్తీ అవుతున్నాయి.