సంబంధిత వార్తలు

త్వరలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగనున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఈరోజు ఉదయం 11.55 గంటలకు ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే అనేక సంక్షేమపధకాలు, బడుగుబలహీనవర్గాలకు, మహిళలకు పలు వరాలు ఇచ్చారు. ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మరిన్ని వరాలు, రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. శాసనమండలిలో మంత్రి నారాయణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు.