తెరాస ఎంపీ కవితకు అరుదైన గౌరవం

నిజామాబాద్‌ తెరాస ఎంపీ కవిత ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, రాజకీయ పరిజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్లలో ఒకరిగా అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా ఆమెకు మరో అరుదైన గౌరవం  లభించింది. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు కేరళ అసెంబ్లీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుగబోతున్నాయి. ఆ సందర్భంగా కేరళ ప్రభుత్వం తిరువంతపురంలోని అసెంబ్లీ కాంప్లెక్స్‌లో ‘క్యాస్ట్‌స్‌ అండ్‌ ఇట్స్‌ డిస్‌కంటెంట్స్‌’ అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించబోతోంది. ఆ సదస్సుకు ముఖ్య అతిధిగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు హాజరవుతారు. దేశంలో వివిద రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది విద్యార్ధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అనేక ప్రముఖులు ఆ సదస్సుకు హాజరుకాబోతున్నారు. ఆ సదస్సులో ప్రసంగించవలసిందిగా కోరుతూ కేరళ స్పీకర్ పి.శ్రీరామకృష్ణన్ తెరాస ఎంపీ కవితను ఆహ్వానించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు.