
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి డిల్లీకి పిలుపు వచ్చింది. రేపు ఉదయం 11గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీవారితో సమావేశం అవుతారు. కనుక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా 17మంది ఎమ్మెల్యేలు, సీఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క, పిసిసి కోశాధికారి గూడూరు నారాయణ రేపు ఉదయం డిల్లీ బయలుదేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధులు, ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలపై చర్చించబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన సీనియర్ నేతలలో కొంతమంది ఈసారి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నందున వారి టికెట్లపై రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.