తెలంగాణ వంటల కోసం ప్రత్యేక విధానాన్ని తయారు చేయించి, తెలంగాణ సంస్కృతిలో భాగమైన వంటలను ప్రజలందరికి అందుబాటులోకి తేవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. సర్వ పిండి, పచ్చిపులుసు, ముద్ద గారె, జొన్న రొట్టె మొదలైన తెలంగాణ రుచులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నది దీని ఉద్దేశం. తెలంగాణ వంటకాలకు ఉమ్మడి రాష్ట్రంలో తగిన గుర్తింపు రాలేదని ఆయన ఒక అధికారిక సమావేశంలో చెప్పి, వాటి ఘనతను చాటేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కేసీఆర్ ఆసక్తిని గమనించిన మంత్రి చందులాల్ చర్యలు చేపట్టారు.సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేషం దీనిపై ఒక విధానం తయారు చేయించారు.విధానం అమలుకు ఒక నిపుణుల కమిటీని కూడా నియమించనున్నారు. ఇప్పటివరకు 260 వంటకాలను గుర్తించారట. వీటిని ప్రతి హోటళ్లలో రెస్టారెంట్లలో ప్రవేశపెట్టాలని తలపెట్టారు. తెలంగాణ వంటలను రాష్ట్రంలో విక్రయించే హోటళ్లకు ఏడాదికి 3లక్షలు, ఇతర దేశాల్లోని వారికి 10లక్షలు వంతున రాయితీ ఇవ్వాలని కూడా ప్రతిపాదించడం విశేషం. అలాగే వంటల పోటీలను కూడా నిర్వహించి బహుమతులు ఇవ్వాలని కూడా అధికారులు నిర్ణయించారు.