ప్రధాని సమావేశం నుండి కెసీఆర్ మిడిల్ డ్రాప్

దిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ ప్రవర్తనపై కొంత మంది పెదవి విరుస్తున్నారు. కానీ కొంత మంది మాత్రం కేసీఆర్ చేసిందాంట్లో ఏం తప్పులేదని వాదిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే కేంద్రం అందరితో కలిసి పని చేస్తుందని ఇంకేమైనా సలహాలు, సూచనలు ఉంటే చెయ్యాలని మోదీ ముఖ్యమంత్రులకు అవకాశం ఇస్తున్న సమయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సమావేశం మధ్యలోనుంచి వెళ్లిపోవడంతో అందరూ షాక్ తిన్నారు. 

ఏకంగా ప్రధాని సమావేశం నుండి సీఎం కేసీఆర్ అర్ధాంతరంగా వెళ్లిపోయారు. కానీ తనకు జ్వరంగా ఉందని, ఎక్కువ సేపు కూర్చోలేనని, మన్నించాలని మోడీ కి చెప్పి వెళ్లారట. దీంతో కెసిఆర్ ప్రసంగాన్ని సీఎస్ రాజీవ్ శర్మ చదివి వినిపించారు. ఇది అర్ధం కాని ఇతర రాష్ట్రాల సీఎంలు…కేసీఆర్ ప్రధాని తీరు, బీజేపీ వ్యవహార శైలి నచ్చక, నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతోనే వెళ్లారని అనుకున్నారట. కానీ తర్వాత అందరికీ విషయం మోడీ స్వయంగా చెప్పినట్లు సమాచారం. అయితే ఇంత వరకు ఏ సీఎం కూడా ఇలా అర్ధాంతరంగా ప్రధాని పాల్గొన్న సమావేశం నుండి వెళ్లిపోలేదట.