శంషాబాద్‌లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బుదవారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం ఇంకా కళ్ళలో మెదులుతుండగానే ఈరోజు సాయంత్రం శంషాబాద్‌ మండలంలోని శాతంరాయి ప్రాంతంలో ఎయిర్ కూలర్లు తయారుచేసే కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అందులో పనిచేసే కార్మికులు చెప్పారు. మంటలు అంటుకోగానే కార్మికులు అందరూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది కానీ రెండతస్తుల భవనంలో నిలువ ఉంచిన కూలర్ విడిభాగాలన్నీ కాలిబూడిదవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. భవనంలో కూలర్లలో ఉపయోగించే ప్లాస్టిక్, కర్ర, గడ్డి వంటివి నిలువచేసి ఉంచడంతో క్షణాలలో మంటలు రెండు అంతస్తులకు వ్యాపించాయి. ప్రమాదం సమాచారం అందుకోగానే నాలుగు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పుతున్నారు.