మేడ్చల్‌లో ఐదుగురు కూలీలు దుర్మరణం

మేడ్చల్‌ జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి వద్ద ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను నిర్మిస్తోంది. వాటిలో 10వ అంతస్తులో పని చేస్తున్న ఐదుగురు కూలీలు ప్రమాదవశాత్తు పైనుంచి క్రిందపడి చనిపోయారు. భవనం బయటవైపు పనుల కోసం కర్రలతో తయారుచేసిన పరంజాలపై నిలబడి కార్మికులు పనులు చేస్తుంటారు. ఆ పరంజాలను బిగించి కట్టిన తాడు తెగిపోవడంతో హటాత్తుగా అది కూలిపోయింది. దాంతో 10వ అంతస్తు వద్ద ఆ పరంజా ప్లాట్ ఫారంపై నిలబడి పనిచేస్తున్న ఐదుగురు కూలీలు అంతా ఎత్తు నుంచి క్రిందపడటంతో చనిపోయారు. 

చనిపోయినవారీలో పశ్చిమబెంగాల్ రాష్ట్రనికి చెందిన సుబాల్ రాయ్ (32), సైపుల్ హక్ (26), అజిత్ రాయ్ (18), బీహార్ రాష్ట్రానికి చెందిన యష్ కుమార్ చౌదరి (20, మిలాన్ షేక్ (20) ఉన్నారు. విబ్లవ్‌ రాయ్‌(18) అనే మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

పశ్చిమ బెంగాల్ కు చెందిన దాస్‌ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే ఓ ప్రైవేటు సంస్థ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొత్తం 52 బ్లాకులలో 6240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించవలసి ఉండగా ఇప్పటి వరకు 18 బ్లాకులలో ఇళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి. నిన్న ఉదయం 11 గంటలకు 12వ బ్లాకులో ఈ దుర్ఘటన జరిగింది. 

ఈ విషయం తెలియగానే మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్,  రాచకొండ కమీషనరేట్ జాయింట్ కమీషనర్ సుధీర్ బాబు, డిసిపి, ఏసీపీ తదితరులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని బొంతు రామ్మోహన్ ప్రకటించడంతో ఆగ్రహంతో ఉన్న మిగిలిన కార్మికులు శాంతించారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకొని చనిపోయినవారి శవాలను పోస్ట్ మార్టం కోసం మార్చూరీకి తరలించారు. వేలాదిమంది భావనా నిర్మాణకార్మికులు పనిచేస్తున్నప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అసిస్టెంట్ ఇంజనీర్ ఏపీ సిఎం చంద్రబాబునాయుడు. నర్సరాజును కలెక్టర్ సస్పెండ్ చేశారు. వీలైనంత త్వరగా ఐదుగురి శవాలను వారి స్వస్థలాలకు చేర్చడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.