నేటి నుండి జరిగే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి కెసిఆర్… తెరాస ఎంపిలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఉన్నత న్యాయస్థానం విభజించకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపిలకు కెసిఆర్ సూచించారు. అదే విధంగా కేంద్రం తీసుకొస్తున్న పలు విధానాలపై అంశాల వారీగా మధ్ధతు తెలపాలని పేర్కొన్నారు.
జిఎస్‌టి బిల్లుకు తెరాస సంపూర్ణ సహకారం అందిస్తుందని ఎంపి జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నేడు ప్రధాని నరేంద్రమోడీతో కెసిఆర్ భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని వెల్లడించారు. హైకోర్టు విభజన అంశం ప్రధాన అజెండాగా పార్లమెంటులో తమ వైఖరి ఉండబోతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, హరితహారం వంటి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆర్ధిక సహకారం అందించాలని కోరతామన్నారు.