కేంద్ర ఎన్నికల కమీషన్‌కు హైకోర్టు నోటీసు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి, దర్మపురి లక్ష్మణ్ కూడా పిటిషన్లు వేశారు. వాటిపై బుదవారం విచారణ జరిపిన హైకోర్టు ఆ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపుగా ఈ పిటిషన్లపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ కు నోటీస్ పంపింది. ఇవే కేసులలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా హైకోర్టు వివరణ కోరింది.