ఎట్టకేలకు ఫలించిన తెరాస ప్రయత్నాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, తెలంగాణ గొప్పదనం, సంస్కృతీ సంప్రదాయాలు చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకచర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ ను ఆనుకొని ఉన్న బైసన్ పోలో మైదానంలో నూతన సచివాలయం నిర్మించాలని సంకల్పించింది. ఆ స్థలం రక్షణశాఖ అధీనంలో ఉండటంతో తెరాస ఎంపీలు, సిఎం కేసీఆర్‌ పలుమార్లు రక్షణమంత్రిని, ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి ఒప్పించారు.

అయితే సామాన్యప్రజలకు ఉపయోగించుకొంటున్న బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ఆ భూముల బదలాయింపు నిలిచిపోయింది. దానిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు బైసన్ పోలో మైదానంలో సచివాలయం నిర్మించుకోవచ్చునని స్పష్టం చేసింది. హైకోర్టు నుంచి ఎటువంటి అవరోదాలు, అభ్యంతరాలు లేవు కనుక త్వరలోనే రక్షణశాఖ బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించవచ్చు కనుక త్వరలోనే నూతన సచివాలయ నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.