
కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) ఈరోజు తెల్లవారుజామున కనుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల స్వైన్-ఫ్లూ జ్వరం కూడా రావడంతో ఆసుపర్తిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
జార్జి ఫెర్నాండెజ్ 1930, జూన్ 3న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. విద్యార్ధిదశ నుంచే ఆయనలోని నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. అనంతరం కార్మికసంఘాల నాయకుడిగా మారి 1994లో సమతా పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆ తరువాత బిజెపిలో తన పార్టీని విలీనం చేసి రాజ్యసభ సభ్యునిగా, రైల్వే, పరిశ్రమలు, రక్షణ శాఖల మంత్రిగా పనిచేసి ఆయా శాఖలలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలు పొందారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత పదేళ్ళ నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జార్జి ఫెర్నాండెజ్ మృతికి ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు.