సంబంధిత వార్తలు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర) బుదవారంనాడు ముగియనుంది. 2017 నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం వద్ద మొదలుపెట్టిన పాదయాత్ర 341 రోజుల పాటు ఏకధాటిగా సాగింది. రేపు సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద ముగించనున్నారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంలో విజయసంకల్ప స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అంతటితో సుమారు ఏడాదిపాటు సాగిన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగుస్తుంది.